అంగారక గ్రహంపై నాసా క్యూరియాసిటీ రోవర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. అంగారకుడిపై తన ప్రయాణంలో 5,000వ మార్టియన్ రోజును (సోల్) పూర్తి చేసుకున్న సందర్భంగా రోవర్ తీసిన చిత్రాలతో నాసా ప్రత్యేకమైన పోస్ట్కార్డ్ను విడుదల చేసింది.
క్యూరియాసిటీ రోవర్ న స్థానిక మార్స్ సమయం ఉదయం 9:56 గంటలకు, అలాగే సాయంత్రం 5:39 గంటలకు చాక్లటల్ () అనే పేరుతో పిలువబడే ఇసుక మైదానం సమీపంలో చిత్రాలను తీసింది. ఈ రెండు సమయాల్లో తీసిన నలుపు-తెలుపు నావిగేషన్ కెమెరా చిత్రాలను భూమికి పంపిన తర్వాత నాసా వాటిని కలిపి ఒకే పనోరమాగా రూపొందించింది.
ఈ చిత్రానికి నీలం, పసుపు రంగులను కళాత్మకంగా జోడించారు. నీలం రంగు ఉదయం తీసిన దృశ్యాన్ని, పసుపు రంగు మధ్యాహ్నం తీసిన దృశ్యాన్ని సూచిస్తుంది. చిత్రంలో రోవర్ వెనుక భాగంలో రేడియో ఐసోటోప్ పవర్ జనరేటర్, కమ్యూనికేషన్ యాంటెన్నా, అలాగే మార్స్ నేలపై రోవర్ ప్రయాణించిన జాడలు కనిపిస్తాయి.
ప్రస్తుతం క్యూరియాసిటీ గేల్ క్రేటర్‌లోని మౌంట్ షార్ప్ దిగువ ప్రాంతాల్లో పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ పర్వతం సుమారు 5 కిలోమీటర్ల ఎత్తు ఉంది.
క్యూరియాసిటీ ఇటీవల మార్స్‌పై 5,000 సోల్స్ పూర్తి చేయడంతో పాటు, తన ల్యాండింగ్ ప్రదేశం నుంచి 1 కిలోమీటరుకు పైగా ఎత్తును అధిరోహించిన మరో కీలక మైలురాయిని కూడా సాధించింది.












