Hyderabad, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం జరిగింది.
మధుయాష్కికి సీఎల్పీ భేటీలో ఘన సన్మానం హైదరాబాద్, సెప్టెంబర్ 10 ( ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా సన్మానించారు.అసెంబ్లీలో జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం మధుయాష్కి గౌడ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అజారుద్దీన్, సీతక్క, పొన్నం ప్రభాకర్‌గౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధుయాష్కి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.












