చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలం శివరామపురం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.
మండలం శివరామపురం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. మరోవైపు రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీలోని 14, 15వ పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా వెళ్లిన మహేష్, సోమశేఖర్‌లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, వారిని బలవంతంగా పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలతో కుప్పంలో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

