మంచిర్యాల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
యువతకు అధికారం, సామాన్య ప్రజలకు సాధికారత కల్పించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం యువత పెద్ద ఎత్తున జనసేనలో చేరాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన జనసేన మహాసభలో ఈ పిలుపునిచ్చారు.
జనసేనలో యువత పెద్ద ఎత్తున : యువతకు అధికారం, సామాన్య ప్రజలకు సాధికారత కల్పించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం యువత పెద్ద ఎత్తున జనసేనలో చేరాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల జనసేన మహాసభను గురువారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్‌గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, చుంచు రాజకీరామ్ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకుడు పడాల రవీందర్ పటేల్ మాట్లాడుతూ సామాజిక తెలంగాణ సాధన జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుత పాలనా విధానాలకు ముగింపు పలికి ప్రజలకు సాధికారత కల్పించేందుకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కొమురం భీమ్, రాంజీ గోండు వంటి మహాయోధుల పోరాటాల గడ్డ అయిన ఆదిలాబాద్ జిల్లా నుంచి జనసేన పార్టీ ఉద్యమం, పోరాటం నేటి నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తామని ఆయన అన్నారు. అల్వాల సంతోష్‌కు సన్మానం జనసేన సాధక్ కార్యక్రమం ద్వారా 312 సభ్యత్వాలు చేయించిన జిల్లా నాయకుడు అల్వాల సంతోష్‌ను ఈ సందర్భంగా సన్మానించారు. జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్‌గౌడ్ చేతుల మీదుగా ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మార్చేట్టి తిరుపతి, రాకేష్, అఖిల్, వాజీద్, అంకర్ శ్రీనివాస్, వినిత్, వంశీ, తేజ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












