భారతదేశం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు పేరును ఓటర్ల జాబితా సవరణలో తప్పుగా నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పేరులో అని రెండు లు పడటాన్ని మిస్ మ్యాచ్‌గా పేర్కొంటూ ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది.
**ఎన్నికల కమిషన్ క్షమాపణ చెప్పాలి భారతరత్న ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు అంటే ప్రపంచమంతా తెలుసు .. భారతదేశానికి ప్రపంచంలో పేరు తెచ్చిన గొప్ప సైంటిస్ట్ .. సైంటిస్టుల్లో భారతదేశంలో ముగ్గురికి భారతరత్న బిరుదులు వస్తే అబ్దుల్ కలాం, సివి రామన్, తర్వాత పేరే సిఎన్నార్ రావుది ఉంటుంది . అంతటి గొప్ప వ్యక్తి ఎవరో తెలియదంటూ ఓటర్ లిస్ట్ సవరణ జాబితాలో నోటీసు పంపారు. ఆయన పేరు మిస్ మ్యాచ్ అయిందంటూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా ఆయనకు నోటీసు పంపి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్ ఐ ఆర్ నమోదుపై దేశవ్యాప్తంగా పలు అభ్యంతరాలు అవక తవకలు ఇబ్బందులు చోటుచేసుకున్నాయి . అయితే భారతరత్న బిరుదు పొందిన వ్యక్తి ప్రపంచంలో ప్రముఖుడు అతిపెద్ద అతి గొప్ప సైంటిస్ట్ ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు పేరు చూసి కూడా ఆయనను వచ్చి వివరించుకోవాల్సిందిగా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాల్సిందిగా కోరారు. ఇంతకీ తప్పు ఏమిటో తెలుసా..?? Proff CNR RAO.. అన్న పేరులో రెండు ఎఫ్ లు ఉన్నాయి. ఇది కంప్యూటర్ తప్పిదం. ఒక ఎఫ్ కు బదులు రెండు f లు కొట్టారు. ఇదొక్కటే మిస్ మ్యాచ్ అంటూ నోటీసు ఇచ్చారు. ఇది అధికారుల తప్పు , ఎస్ఐఆర్ విధానం చేసే పద్ధతిలో కంప్యూటర్లలో జరుగుతున్న పొరపాటే. ఇలాంటి సంఘటనలు చాలా దృష్టికి వస్తున్నప్పటికీ సిఎన్ఆర్ రావు వ్యవహారంతో చర్చ తీవ్రతరమైంది. ఓటర్ లిస్ట్ సవరణ అభ్యంతరాలు అనర్హుల పేర్లు తొలగించడం లాంటి చర్యలు సమంజసమే అయినా ఇంత గుడ్డిగా పనిచేయడం అన్యాయమే..?? రాజ్యాంగ విరుద్ధం కూడా. ఓటు హక్కు అనేది భారత పౌరులకు ఒక స్వేచ్చ ప్రజాస్వామ్య ప్రక్రియ ని స్థాపింప చేయడడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది... ఇదే లేకుండా చేస్తే నియంత ప్రభుత్వాలు వస్తాయి.. ఓటు ను కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని నిలబెడుదాం.












