చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీపాల కాంతుల వలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులతో నిండాలని ఆయన ఆకాంక్షించారు.
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళి పండుగను జరుపుకుంటామని, నరకాసుర వధతో దీపావళి పండుగ జరిగినట్లు, మన తెలంగాణ లోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లివిరియాలని అన్నారు. అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి బంగారు తెలంగాణ సాధనలో నూతనోత్తేజంతో ముందడుగు వేయాలని అన్నారు. అలాగే, బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూజలకు ప్రత్యేకమైన కార్తీక మాసంలో చేసే పూజలు ఫలించాలని ఆయన ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.












