సారంగాపూర్, 8 November
నిర్మల్ జిల్లా మండలం చించోలి(బి) గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంత్ రావు, సర్పంచ్ సాయన్న, పంచాయతీ కార్యదర్శి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.












