రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ఈ నెల 11న జరిగే రైతు గర్జనను జయప్రదం చేయాలని భారత రాష్ట్ర సమితి బీసీ సంఘం నాయకులు సుంకేట పోశెట్టి పిలుపునిచ్చారు.
యూరియా కష్టాలు, కరెంట్ కోతలతో అరిగోస పడుతున్న రైతుల పక్షాన తమ గళాన్ని వినిపించేందుకోసం ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గ్రౌండ్ లో రైతు గర్జన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సభకు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. కావున రైతు గర్జన సభకు జిల్లాలోని రైతు సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి జాన్సన్ నాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, నియోజకవర్గ ఇంచార్జి రాంకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు.












