జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరగనున్న రైతు గర్జన సభ స్థలంలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్ తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు.

సభ విజయవంతం చేయాలని పిలుపు
ఈ సందర్భంగా రాబోయే రైతు గర్జన సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వినయ్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్యామసుందర్, ముధోల్ నియోజకవర్గ సమన్వయకర్త విలాస్ గదేవర్, పట్టణ అధ్యక్షులు రాము, అయ్యనగారి రాజేందర్, శ్రీకాంత్ యాదవ్, సల్మాన్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.