సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన, కాంగ్రెస్ బహిరంగ సభ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
జగిత్యాల పట్టణ అధ్యక్షుడు ఐలేనేని వెంకటేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్, రాగుల రాజు, గంగిపెల్లి వేణుమాధవ్, నక్క గంగాధర్, కేసీఆర్, నవీన్, కౌన్సిలర్ తోట హరీష్, తుమ్మపెల్లి సంతోష్, ఆడెపు సత్యం తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను పోలీసులు వివిధ ప్రాంతాలకు తరలించారు.












