ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపం నుంచి భారీ ర్యాలీని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా 120కి పైగా బస్సులు, 150కి పైగా కార్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిరిసిల్లకు బయలుదేరాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











