నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగాన్ని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిర్మల్ జిల్లా ఎస్సీ విభాగం ఇన్చార్జి కుర్మే మహేందర్, సమన్వయకర్త తలారి ఆశన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల ఎస్సీ విభాగం కమిటీ జాబితాను వారికి అందజేశారు.
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగాన్ని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిర్మల్ జిల్లా ఎస్సీ విభాగం ఇన్చార్జి కుర్మే మహేందర్, సమన్వయకర్త తలారి ఆశన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల ఎస్సీ విభాగం కమిటీ జాబితాను జిల్లా ఎస్సీ విభాగం ఇన్చార్జి కుర్మే మహేందర్, సమన్వయకర్త తలారి ఆశన్నకు నిర్మల్ జిల్లా ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి కాల్వ రఘు, మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు గడ్డం అశోక్ అందజేశారు. జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో ఎస్సీ విభాగం కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు కట్ట శ్యామ్ సుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తూర్పటి వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శులు కొంతం గణేష్, శంకర్, సాహెబ్ రావు, నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కత్తి నరేందర్ తో పాటు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.











