ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలలో కూటముల అభ్యర్థులను గెలిపించాలని జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి కోరారు. శుక్రవారం మిర్యాలగూడ ఆర్టీసీ డిపో పరిధిలో అనుబంధ సంస్థ ఎస్.డబ్ల్యూ.ఎఫ్. టి.డబ్ల్యూ.యు, అశ్వద్ధామరెడ్డి (టి.ఎం.యు-ఏ)లు కూటములుగా ఏర్పడి గుర్తింపు సంఘం ఎన్నికలకు పోటీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీలో గత పది సంవత్సరాలుగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగలేదన్న విషయం పాఠకులకు విధితమే. అధికారంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలనలో మొదటిసారిగా ఆర్టీసీలో జరిగే ఎన్నికలలో కూటముల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నూతన కార్యవర్గాన్ని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
నూతన కార్యవర్గాన్ని మిర్యాలగూడ డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డికి పరిచయం చేయడం జరిగిందని కూటముల కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ డిపో అధ్యక్షులుగా పి. బాలయ్య (కండక్టర్), ఉపాధ్యక్షులుగా ఎన్. రాములు (సీనియర్ అసిస్టెంట్), వై.ఎస్. నందం (టి.ఐ.3), జి. నరసింహ (టి.ఐ.3), బి. ఏ. మేరీ (ఎడిసి) ఉన్నారు. కార్యదర్శిగా టి. వినయ్ కుమార్ (ఎడిసి), సహాయ కార్యదర్శులుగా సిహెచ్ సైదులు (కండక్టర్), ఎం. వెంకన్న (కండక్టర్), పి. రమేష్ (కండక్టర్), ప్రచార కార్యదర్శిగా ఎం చంద్రయ్య (కండక్టర్), కోశాధికారిగా కె రాములు, కమిటీ సభ్యులుగా సిహెచ్. పారిజాతం, ఎంఎల్ చారి, పి. శ్రీనివాస్ (డ్రైవర్) లు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు అని గౌతమ్ రెడ్డి తెలిపారు.












