మండల పరిధిలోని క్రీస్తు నాయక్ తండకు చెందిన బాదావత్ ప్రమీలకి, ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిసె రమేష్ యాదవ్ 19 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోందని, ఇతర పార్టీల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
మండల పరిధిలోని క్రీస్తు నాయక్ తండకు చెందిన బాదావత్ ప్రమీలకి, ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిసె రమేష్ యాదవ్ 19 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోందని, అయితే కొంతమంది ఇతర పార్టీలకు చెందినవారు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. గతంలో మీరు పరిపాలించినప్పుడు చేయలేని పనులను మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపిస్తోందని తెలిపారు. గతంలో మీరు గ్రామాలలో ఏ ఒక్క ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కూడా మంజూరు చేయలేదని, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని చెప్పారు. మేము ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా రూపాయి కూడా తీసుకోకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను వింటూ నిస్వార్థంగా సేవ చేస్తున్నారని, ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ, సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ భూమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూమేష్, వైస్ ప్రెసిడెంట్ మహేందర్, నాను, ఇస్మాయిల్ షేక్, ఆదిల్, గొర్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.












