చిన్నకోడూరు (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 08
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తూ సబ్బండా వర్గాలకు మేలు చేస్తోందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తూ సబ్బండా వర్గాలకు మేలు చేస్తోందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ ఆధ్వర్యంలో, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు వల్లబోజు ఈశ్వరమ్మ ఇంట్లో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
నాయకుల ఆకాంక్షలు
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ, ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మరో పదేళ్లపాటు తెలంగాణ ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంద బోయిన పరుశురాం, ఏఎంసీ డైరెక్టర్లు ఎండి సలీం, పాకాల భూపతిరెడ్డి, లక్ష్మి, అశోక్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంద శ్రీకాంత్, సీనియర్ నాయకులు పొన్నల రాజేష్, బత్తిని గణేష్, ఉడుత జయంత్, పంతం శ్రీనివాస్, హరిబాబు, గుండు వెంకట్, మహేందర్ రెడ్డి, కొమ్ము ప్రశాంత్, కొమ్మ ఎల్లయ్య, రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టిపర్తి చందు, నక్కరాజు, కాల్వ జగన్, శేషు, నరేష్, దొమ్మాట శ్రీనివాస్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.












