నిర్మల్, 9 September
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించి, తెలుగు శాఖ ప్రచురించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.
**ఆర్జీయూకేటీలో ఘనంగా కాళోజీ 112వ జయంతి, పుస్తకావిష్కరణ వేడుకలు** (మనోరంజని తెలుగు టైమ్స్ జిల్లా ప్రతినిధి) బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలనుఘనంగానిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలువేసినివాళులర్పించారు.తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆర్జీయూకేటీ తెలుగు శాఖ ప్రచురించిన ‘వ్యాస సరస్వతి’, ‘వ్యాస వాణి’ అనే రెండు వ్యాస సంపుటాలపుస్తకాలనుఉపకులపతిప్రొఫెసర్ఏ.గోవర్ధన్ఆవిష్కరించారు. ఈ రెండు పుస్తకాలకు డాక్టర్ ఎం.రమాదేవి,డాక్టర్జె.రాయమల్లుసంపాదకత్వం వహించారు.ఈ సందర్భంగా ప్రో. ఏ . గోవర్ధన్ మాట్లాడుతూతెలుగు భాషా వికాసానికి తెలుగు శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సాంకేతిక విద్యనభ్యసిస్తూనే మాతృభాష పట్ల అమితమైన ఆసక్తి, చొరవ చూపుతున్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రోత్సహించారు. తెలంగాణ భాషాదినోత్సవాన్నిపురస్కరించుకొని బి.టెక్.లో తెలుగు సాహిత్యాన్ని మైనర్ కోర్సుగా ప్రవేశపెట్టడానికి కావలసిన విధివిధానాలను రూపొందించడానికి ప్రణాళికను సిద్ధం చేసే దిశగా ఉద్దేశించడం జరిగింది. తెలుగుశాఖనిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొని గెలిచిన విద్యార్థులకు ఉపకులపతి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎం.రమాదేవి, డాక్టర్ జెరాయమల్లు,అధ్యాపకులు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ రాములు, డాక్టర్ బాలకృష్ణ, యు. ముత్యం, పి. రాములు, లక్ష్మీ, డాక్టర్ జి. అనిల్ కుమార్, చింతా నరేశ్ , ఎం . హరికృష్ణ, బోధనా, బోధనేతర సిబ్బంది, వివిధ అధికారులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనారు.












