బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతిని పురస్కరించుకుని మహాగాంవ్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ యాస, భాష గొప్పదనాన్ని చాటిచెప్పేలా పద్యాలు, కవితలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కాళోజీ జీవితం, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.
మహాగాంవ్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతిని పురస్కరించుకుని మహాగాంవ్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ యాస, భాష గొప్పదనాన్ని తెలిపే పద్యాలు, కవితలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కాళోజీ జీవితం, ఉద్యమ స్ఫూర్తిని వివరించారు. ఉపసర్పంచ్ వరపు కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ యాస, భాషలను పరిరక్షించుకోవాలని సూచించారు.ప్రధానోపాధ్యాయుడు నరాల కనకరాజు మాట్లాడుతూ భాష సంస్కృతి, సంప్రదాయాలకు జీవన వాహినిగా నిలుస్తుందని తెలిపారు. తెలుగు ఉపాధ్యాయుడు గంగుల చిన్నన్న విద్యార్థులకు రూ.2 వేల విలువైన చూచిరాత పుస్తకాలను అందించారు. మండల ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన సబ్బన్వార్ రాగిణిని ఉపాధ్యాయులు సన్మానించారు.












