ఇప్పటికైనా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
గిరిజన ప్రజల అతి పెద్ద పండుగ అయిన తీజ్ సమీపిస్తున్న వేళ, నిర్మల్ జిల్లా మామడ మినీ గురుకులం వద్ద తల్లిదండ్రుల ఆవేదన కట్టలు తెంచుకుంది. కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా పిల్లలతో కలిసి తీజ్ పండుగను ఘనంగా జరుపుకోవడం గిరిజనుల ఆచారం. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగ కోసం పిల్లలు కూడా ఎదురుచూస్తుంటారు.

అందుకే తల్లిదండ్రులు రెండు రోజులుగా గురుకులానికి వచ్చి పండుగ ఉంది.. పిల్లలను ఇంటికి పంపండి మేడం అంటూ సిబ్బందిని వేడుకుంటున్నారు. కానీ ఇక్కడి సిబ్బంది మాత్రం గత రెండు రోజులుగా పంపిస్తాం.. రేపు పంపిస్తాం అంటూ దాటవేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూడా చాలా మంది తల్లులు గురుకులం గేటు బయట గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గేటు తీయకపోవడంతో బయటే నిలబడి లోపలికి చూస్తూ ఉండిపోయారు.
తల్లిదండ్రులు పండుగ సందర్భంగా ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దూర ప్రాంతాల నుండి ఆటోలకు డబ్బులు పెట్టుకుని వస్తున్నా పిల్లలను చూడలేక, ఇంటికి తీసుకెళ్లలేక నిరాశతో వెనుదిరుగుతున్నామని వాపోతున్నారు.
జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు, మామడ మినీ గురుకులం ప్రిన్సిపాల్ స్పందించి తీజ్ పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులు ఇచ్చి తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.