సారంగాపూర్, 14 September
ఉపాధ్యాయ వృత్తిని కేవలం బోధనకే పరిమితం చేయకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తనవంతు బాధ్యతగా భావిస్తున్నారు.
ఉపాధ్యాయ సేవలకు గుర్తింపుగా ముండల విలాస్‌కు గురు రత్న అవార్డు నిర్మల్: విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తూ, విద్యాబోధనలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ఉపాధ్యాయుడు ముండల విలాస్‌కు గురు రత్న అవార్డు లభించింది. మండలం జామ్ గ్రామానికి చెందిన ఆయన ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ విద్యార్థులలో విద్యా నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మంచి విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించేందుకు వివిధ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం బోధనకే పరిమితం చేయకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తనవంతు బాధ్యతగా భావిస్తున్నారు. అదేవిధంగా హ్యుమానిటీ ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవా భావాన్ని కొనసాగిస్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలనే ఉద్దేశంతో వారిలో అవగాహన కల్పిస్తున్నారు.












