ఐసీసీ అండర్-19 ఆసియా కప్ 2026లో భారత యువ జట్టు తమ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒమన్‌లోని అల్ అమరాత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు.
భారత కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. నేపాల్ బ్యాటర్లలో దర్శ్ సోనార్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ 18 పరుగులిచ్చి మూడు వికెట్లు, అర్జున్ రాజ్‌పుత్ 8 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. యశ్వీర్ గౌడ్ రెండు వికెట్లు, కవ్య పటేల్, మనల్ చౌహాన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఆర్యవీర్ సెహ్వాగ్ 70, లక్ష్య రాయ్‌చందానీ 53 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత జట్టు టోర్నీలో శుభారంభం చేసింది. భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో న పాకిస్థాన్‌తో తలపడనుంది.











