కామారెడ్డి, 14 September
కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టరేట్లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి తొలిరోజు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజల్లో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో ఘనంగా వినాయక చవితి పూజలు కామారెడ్డి, సెప్టెంబరు 14: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టరేట్లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి తొలిరోజు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, టీజీవో జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజశేఖర్, రాజ్‌కుమార్, ఎల్లారెడ్డి, మెట్టు రవీందర్, సుమన్‌కుమార్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.











