తానూర్, 14 September
నిర్మల్ జిల్లా మండలం ఝరీ బి గ్రామంలోని మహాదేవుని శివాలయం వద్ద సార్వజనిక గణేష్ విగ్రహాన్ని సోమవారం ఘనంగా ప్రతిష్ఠించారు. విగ్రహ దాత గొడుగు నాగేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొలువుదీరిన ఝరీ బి సార్వజనిక గణనాథుడు ( నిర్మల్ జిల్లా మండలం ఝరీ బి గ్రామంలోని మహాదేవుని శివాలయం వద్ద సార్వజనిక గణేష్ విగ్రహాన్ని సోమవారం ఘనంగా ప్రతిష్ఠించారు. విగ్రహ దాత గొడుగు నాగేష్ బాబు ఆధ్వర్యంలో సాయంత్రం 5.10 గంటలకు ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశుడి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షించారు.కార్యక్రమంలో గణేష్ మండలి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దొంతుల రమేష్, ఉపాధ్యక్షుడు ఈశ్వర్ పటేల్‌తో పాటు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.











