తానూర్, 11 September
మండల పరిధిలోని ఝరి బి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నూతన గణేష్ ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దొంతుల రమేష్ అధ్యక్షుడిగా, ఈశ్వర్ పటేల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఝరి బి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక మండల పరిధిలోని ఝరి బి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా దొంతుల రమేష్, ఉపాధ్యక్షుడిగా ఈశ్వర్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, ఆధ్యాత్మిక శోభతో వైభవంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు సూచించారు.అనంతరం నూతన అధ్యక్షుడు దొంతుల రమేష్, ఉపాధ్యక్షుడు ఈశ్వర్ పటేల్ మాట్లాడుతూ... తమపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతం చేస్తామని పేర్కొన్నారు











