దుమ్ముగూడెం, 14 September
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మీనగరం గ్రామంలో ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో మద్ది రాము అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం లక్ష్మీనగరం గ్రామంలో సోమవారం ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో మద్ది రాము అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. లక్ష్మీనగరం గ్రామ పరిధిలో ఇసుక లారీ వెళ్తుండగా రామును ఢీకొన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాము అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











