పశ్చిమగోదావరి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 12
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి ఆఫీసు నుంచి అనుమతి తీసుకుని వెళ్లిన యువతి, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా గాయపడ్డాడు.
*Hyderabad: సెల్‌ఫోన్ రిపేర్ కోసం వెళ్లిన యువతి.. ఊహించని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు..* ఫోన్ రిపేర్ చేయించుకుని గంటలో వచ్చేస్తా.. అని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వెళ్లిన ఆ యువతి.. ఊహించని ప్రమాదంలో మృత్యుఒడికి చేరుకుంది. హైదరాబాద్ అమీర్‌పేటలో ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బంజారాహిల్స్ నుంచి అమీర్‌పేటకు ర్యాపిడోపై వెళ్తుండగా అసలేం జరిగింది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. హైదరాబాద్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆఫీసులో కాసేపు పర్మిషన్ తీసుకుని సెల్‌ఫోన్ బాగు చేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా భీమవరానికి చెందిన హేమదుర్గ (26) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బస చేస్తూ, బంజారాహిల్స్‌లోని ప్రముఖ కార్ల షోరూమ్‌లో ఉద్యోగం చేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా రోజూలాగే ఆఫీసుకు వచ్చిన ఆమె.. తన మొబైల్ ఫోన్ పాడవడంతో దాన్ని రిపేర్ చేయించుకోవాలని భావించింది. *క్షణాల్లో ముంచుకొచ్చిన మృత్యువు* సెల్‌ఫోన్ బాగు చేయించుకుని త్వరగానే తిరిగి వచ్చేస్తానని ఆఫీసులో పర్మిషన్ తీసుకున్న హేమదుర్గ.. అమీర్‌పేట వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది. ఆ బైక్‌పై అమీర్‌పేట బిగ్‌బజార్ వెనుక గేట్ సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హేమదుర్గ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు....












