వనపర్తి జిల్లా ఎదుల మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా, ఎస్పీ రెడ్డి ఫర్టిలైజర్ పక్కన ఉన్న ఆన్లైన్ సెంటర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తహసీల్దార్ తస్కిన్ మోబినాకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
తహసీల్దార్ వివరణ
ఈ ఘటనపై తహసీల్దార్ తస్కిన్ మోబినాను వివరణ కోరగా, విధులు నిర్వహించుకుని తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. తన సొంత కారు మరమ్మతులో ఉండటంతో, తెలిసిన వారి కారును తీసుకువచ్చినట్లు ఆమె వెల్లడించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతోనే ప్రమాదం జరిగిందని, తనకు స్వల్ప గాయాలయ్యాయని ఆమె వివరించారు.






