ఉట్నూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 14
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 108, 102 అంబులెన్స్‌లను ప్రాజెక్టు మేనేజర్ జనార్ధన్ తనిఖీ చేసి, వైద్య పరికరాలు, రికార్డులను పరిశీలించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108, 102 అంబులెన్స్‌లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జనార్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లలోని వైద్య పరికరాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అధికారులకు సూచనలు
గిరిజన ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అదేవిధంగా, మండల కేంద్రంలో అందుబాటులో ఉన్న 102 అంబులెన్స్ ద్వారా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన పరీక్షలను క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్లి, వారికి సురక్షితంగా వైద్యం అందించి క్షేమంగా ఇంటికి చేర్చాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈఎంటీ () శంకర్, రాజశేఖర్, పైలట్లు ప్రవీణ్ కుమార్, బాపూరావు, 102 కెప్టెన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

