తానూర్, 2026-11-10
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో మంగళవారం సదర్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో మంగళవారం సదర్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులతో ప్రదర్శన నిర్వహించనున్నారు.
యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ పండుగను పురస్కరించుకొని, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొననుంది. దున్నపోతులకు రంగురంగుల అలంకరణలు చేసి, డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు గ్రామ ప్రజలు, యువత, యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై పండుగను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.






