లక్ష్మణచాంద, 9 November
లక్ష్మణచందా మండల కేంద్రంలో శ్రీ భీమన్న జాతర, భీమన్న కళ్యాణము మరియు అగ్ని గుండ ప్రవేశం అత్యంత వైభవంగా జరిగింది.
లక్ష్మణచందా మండల కేంద్రంలో శ్రీ భీమన్న జాతర, భీమన్న కళ్యాణము మరియు అగ్ని గుండ ప్రవేశం అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల కోలాహలం, తప్పెట్ల వాయిద్యాల నడుమ భీమన్న కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అగ్ని గుండ ప్రవేశం చేశారు.
బండారు బాసంతం తర్వాత భీమన్న స్వామిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం కులస్తులు, పెద్ద మనుషులు, నచ్చన రవి, మస్కాపురం రవి, సర్పంచ్ ఓస కవితరాజు తదితరులు పాల్గొన్నారు.
జాతరను విజయవంతం చేయడానికి గ్రామస్తులు, యువకులు కృషి చేశారు.






