నిర్మల్, 9 November
ని్మల్ ఆ్టీసీ డిపో నుంచి పిత్ శైక్షేత్మైన కళేశ్నికి నూతన ఎక్స్ప్ెస్ బస్సు స్ీసును ప్ంభించు. ఈ బస్సు ప్తిోజూ నడుస్తుందని, భక్తులు, ప్యికులకు సౌక్యంతంగ ఉంటుందని డిపో మేనేజ్ కే. పండి తెలిపు.
పవిత్ర శైవక్షేత్రమైన కాళేశ్వరానికి నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి నూతనంగా ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు. ప్రతిరోజూ ఈ బస్సు నిర్మల్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు కాళేశ్వరం చేరుకుంటుందని పేర్కొన్నారు.
బస్సు సమయాలు
తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు నిర్మల్ చేరుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు, ప్రయాణికులకు ఈ బస్సు సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కే. పండరి కోరారు.






