మిర్యాలగూడ, 9 November
కు జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నాయని, దీనిని జిల్లాగా ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కృషి చేయాలని సామాజికవేత్త జాడి రాజు, ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి వస్కుల మట్టయ్య, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు తమ్మడబోయిన అర్జున్ అన్నారు. సోమవారం లోని జ్యోతిరావు పూలే భవనంలో జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లా ఏర్పాటుకు కు అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నప్పటికీ, రాజకీయ దురుద్దేశంతో చిన్న నియోజకవర్గాలను జిల్లాలుగా చేశారని, ను జిల్లాగా చేసే విషయంలో వివక్ష చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో, ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం సంవత్సరాల తరబడి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేసిన ను విస్మరించడం సరైంది కాదని అన్నారు. జిల్లా ఏర్పాటు సమయంలో ను జిల్లాగా చేయాల్సి ఉన్నప్పటికీ, రాజకీయ దురుద్దేశంతో పక్కన పెట్టారని, ప్రస్తుతం 34వ జిల్లాగా ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్తగా జయపాల్ రెడ్డి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నందున, వాటికంటే ముందు, ఎంతో కాలంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల మేనిఫెస్టోలో జిల్లా ఏర్పాటు మొదటి అంశంగా ఉందని, జిల్లా ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. అదేవిధంగా, పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, కేతావత్ శంకర్ నాయక్ లు జిల్లా ఏర్పాటుపై స్పందించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జిల్లా ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు అడ్వకేట్ సత్యనారాయణ, రాపోలు పరమేష్, దాసరాజు జయరాజు, మాలోతు దశరథ నాయక్, కృష్ణ కాంత్ నాయక్, ఈశ్వర చారి, అంజిబాబు, భాస్కర్, సైదులు, రాజు, వెంకట నర్సయ్య, శంకర్, అంజయ్య, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.






