లక్ష్మణచాంద, 9 November
లక్ష్మణ్ చందా మండలంలోని పార్పల్లి గ్రామానికి చెందిన రైతు పుట్టి గంగాధర్ (50) పురుగుల మందు తాగి మృతి చెందాడు.
లక్ష్మణ్ చందా మండలంలోని పార్పల్లి గ్రామానికి చెందిన రైతు పుట్టి గంగాధర్ (50) పురుగుల మందు తాగి మృతి చెందాడు.
గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో పాటు మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందినట్లు సమాచారం.
సంఘటన వివరాలు
శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన ఇంట్లో పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటుండగా, పెద్ద కుమారుడు గమనించి వెంటనే నిర్మల్‌లోని తిరుమల నర్సింగ్ హోమ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 6 గంటలకు మృతి చెందాడు.
పోలీసుల దర్యాప్తు
మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






