భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించనున్నారు.
ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడు కూడా భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి ఉత్సవాల (జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ఆశిస్తూ, మీరు తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాము.
దేశ ప్రగతికి, విద్యా రంగానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
కార్యక్రమ వివరాలు
ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:30 గంటలకు అంబేద్కర్ చౌక్, బస్ స్టాండ్ మెయిన్ రోడ్డు, మండల కేంద్రంలో జరగనుంది. మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యావంతులు, మరియు యువతీయువకులు అందరూ సకాలంలో విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
ఈ కార్యక్రమాన్ని కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ, , నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సయ్యద్ నాయిం ఓద్దీన్ నిర్వహిస్తున్నారు. మౌలానా ఆజాద్ గారి విద్యా సేవలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

