నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో బుధవారం ఇంటింటికీ వెళ్లి పట్టభద్రులను నల్గొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. గడువులోగా పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
23 ఏళ్లు పూర్తయిన వారు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు ఆధార్ కార్డు ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రస్తుత వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











