కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన, పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవు అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. మంగళవారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు ఆదేశాలకు అనుసరించి ప్రతి ఒక్కరు నడవాలి అన్నారు. మిర్యాలగూడ పార్టీ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరగాలన్న పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కు అనుమతి తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిది అని, ఒక వ్యక్తి కోసం పనిచేయదు అన్నారు. చిన్న చిన్న భేదా భిప్రాయాలు ఉన్న.. తప్పులు సరిదిద్దు కుంటూ..ఐక్యమత్యంతో అందరూ కలిసి మెలిసి పార్టీ కోసం పని చేయాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుందన్నారు. రాబోయే రెండు సంవత్సరాలలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచి, వచ్చే ఎన్నికలలో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. దీపావళి పండుగ లోగా మంత్రుల చేత మిర్యాలగూడ పట్టణ శివారు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించడంతోపాటు దామరచర్ల మండలం కేంద్రంలో 150 ఇందిరమ్మ ఇండ్ల కాలనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన, మిర్యాలగూడలో ప్లే ఓవర్ పనులు చేపట్టేందుకు కొబ్బరికాయ కొట్టుతారని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా డిగ్రీ పూర్తి చేసిన అర్హులు ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు స్కైలాబ్ నాయక్, ఉపేందర్ రెడ్డి, చిలుకూరి బాలు, గుడిపాడి నవీన్, నూకల వేణుగోపాల్ రెడ్డి, తలకోప్పుల సైదులు, పోదిలే శ్రీనివాస్, కౌన్సిలర్లు వాడి ఇన్చార్జులు మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు..
Share:

సారాంశం
దీపావళి లోగా డబల్ బెడ్ రూమ్ ఇల్లు : ఎమ్మెల్యే బిఎల్ఆర్
ముఖ్య విషయాలు
- కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన, పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవు అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
- మంగళవారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలుతెలియజేశారు.
- అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు ఆదేశాలకు అనుసరించి ప్రతి ఒక్కరు నడవాలి అన్నారు.
- మిర్యాలగూడ పార్టీ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరగాలన్న పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కు అనుమతి తీసుకోవాలన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,976వ్యూస్










