జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారికి తగిన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు ఈశ్వర్ జాదవ్ తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని పాలగుండం మైదానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు వివిధ గ్రామాలు, మండలాల నుంచి క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోటీల్లో క్రీడాకారులు తమ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ జాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు, వేదికలు లేక వారి ప్రతిభ వెలుగులోకి రావడం లేదని అన్నారు. అలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, వ్యసనాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణతో క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావచ్చని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారి ప్రతిభను నిరూపించుకునేందుకు మెరుగైన వేదికలు కల్పించడమే తమ లక్ష్యమని ఈశ్వర్ జాదవ్ స్పష్టం చేశారు.
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం: క్రికెట్ పోటీలతో యువతకు మంచి వేదిక
Share:

సారాంశం
జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారికి తగిన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు ఈశ్వర్ జాదవ్ తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని పాలగుండం మైదానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు వివిధ గ్రామాలు, మండలాల నుంచి క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోటీల్లో క్రీడాకారులు తమ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా ఈశ్వర్ జాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు, వేదికలు లేక వారి ప్రతిభ వెలుగులోకి రావడం లేదని అన్నారు.
- అలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.
- యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, వ్యసనాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
- జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారికి తగిన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు ఈశ్వర్ జాదవ్ తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,769వ్యూస్









