నిర్మల్ జిల్లా మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ తాడేవార్ విఠల్ సోదరుడు, బోల్సా గ్రామానికి చెందిన పోతన్న సోదరుడి కుటుంబాలను ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ శనివారం పరామర్శించారు.
మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ తాడేవార్ విఠల్ సోదరుడు, అలాగే బోల్సా గ్రామానికి చెందిన పోతన్న సోదరుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ శనివారం ఆయా గ్రామాల్లోని మృతుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చి ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ తో పాటు, ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రే, శ్యామ్‌రావు పటేల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్. పుండలిక్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ డి. రాములు, సీనియర్ నాయకులు శెట్టి పటేల్, గోవింద్ పటేల్, షేక్ బషీర్, సత్తార్, అంబేకర్ విఠల్, ఖాదర్‌ఖాన్, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు పవార్ సాయినాథ్, హిప్నెల్లి సర్పంచ్ శివరాం చంద్రే పాల్గొన్నారు. గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












