బైంసా మండలంలోని సర్పంచ్‌లు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. బైంసాలోని సురులోక్ గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పెరిగేలా కృషి చేయాలని అన్నారు.
బైంసా మండలంలోని సర్పంచ్‌లు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. బైంసాలోని సురులోక్ గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పెరిగేలా కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తానూర్, మండలాలకు చెందిన 134 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అందజేశారు. దసరా పండుగ నేపథ్యంలో అన్ని మండలాల్లో చెక్కులను అందించడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మండల కేంద్రంలో 35 మంది మహిళలకు కుట్టు మిషన్లను ఎమ్మెల్యే పటేల్ అందజేశారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించారు.
మండల కేంద్రానికి చెందిన గాయక్ వాడ్ జల్బ ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. బైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామంలో ఆనందరావు పటేల్ కు చెందిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పటేల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.












