రాజన్న జిల్లా వేములవాడలో 11 టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది.
రాజన్న జిల్లా వేములవాడలోని సుభాష్ నగర్ వీధిలో 11 టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం 5వ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి కృపతో ఇంటిలోని సకల దోషాలు, కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని భక్తులు నమ్మకంతో పూజలు చేశారు. ఈ సందర్భంగా 11 టైగర్స్ యూత్ సభ్యులు ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.







