సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో కొలువై ఉన్న దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఆలూరు నుండి నిర్మల్ విశ్వనాథ్ పేటలోని శ్రీ నందిగుండా దుర్గాదేవి టెంపుల్ వరకు పాదయాత్ర ప్రారంభమైంది.
ఈ యాత్రలో దుర్గాదేవి దీక్షపరులు, ఆలూరు ప్రజలు, అంబేద్కర్ యూత్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఈ పాదయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.










