నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పదాధికారులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం నూతన అధ్యక్షుడిగా బల్గూరి రాజేశ్వర్ రావు బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి విజయరావు, కోశాధికారిగా మార్నేని పాపేశ్వర్ రావు కూడా బాధ్యతలు స్వీకరించారు. వీరితోపాటు సంఘం ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, సంచాలకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు వెలమ సంఘం ప్రతినిధులు, సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జడ్పి చైర్మన్, మాజీ సంఘం అధ్యక్షులు దాదాన్నగారి విఠల్ రావు మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారం చేసిన నూతన అధ్యక్షులు బల్గురి రాజేశ్వర్ రావు, వారి ఆఫీస్ బేరర్స్కు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయించిన ముఖ్య ఎన్నికల అధికారి దాదాన్నగారి మధుసూదన్ రావు (మాజీ పి.పి.) వారి బృందానికి, ఎన్నికలను సక్రమంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
నూతన కమిటీ సంఘ అభివృద్ధి తో పాటు సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. సభ్యుల సమస్యల పరిష్కారానికి, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి నూతన నాయకత్వం కృషి చేయాలని సూచించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన వెలమ సంఘం నూతన సంచాలకురాలు బాసర నర్సూరి శిరీషకు ప్రత్యేక గుర్తింపు లభించింది. నిజామాబాద్, జిల్లాలకు చెందిన సంఘం కార్యవర్గాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు జిల్లాల్లో వెలమ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు సభ్యుల సంక్షేమం, ఐక్యత, అభివృద్ధి కోసం నూతన కార్యవర్గాలతో కలిసి పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
నూతన బాధ్యతలు చేపట్టిన పదాధికారులు, కార్యవర్గ సభ్యుల సమష్టి కృషితో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు ఆర్. రాంకిషన్ రావు, బాధగునా నర్సింగ్ రావు (బాన్స్వాడ రిటైర్డ్ ప్రిన్సిపాల్), ఏం. ప్రకాష్ రావు, కాంట్రాక్టర్ సురేందర్ రావు, తాజా మాజీ అధ్యక్షులు కిషోర్ రావు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











