తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్లో వైభవంగా నిర్వహించారు. దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ముందస్తుగా వేడుకలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురాలు శశిరేఖ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు శశిరేఖ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
సంప్రదాయాలను కొనసాగించాలని సూచన
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు విద్యార్థులు తమ ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతూ తెలంగాణ సంప్రదాయాలను కొనసాగించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశిరేఖ, కరస్పాండెంట్ మధుసూదన్, లక్ష్మీప్రియతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












