నిర్మల్ జిల్లా మండలంలోని ఝరీ బి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మను అందంగా అలంకరించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ప్రకృతిని పూజిస్తూ మహిళలు, యువతులు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల వైభవానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓం ప్రకాష్, ఉపాధ్యాయులు సాయికిరణ్, రోజా రాణి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేలా ఈ వేడుకలు నిర్వహించారు.












