సోన్ మండలంలోని సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ, కోలాటం ఆడుతూ సందడి చేశారు. ఉపాధ్యాయురాలు సౌజన్య పండుగ ప్రాముఖ్యతను వివరించారు.
సోన్ మండలంలోని సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ, కోలాటం ఆడుతూ సందడి చేశారు. ముందుగా ఉపాధ్యాయురాలు సౌజన్య బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ, కోలాటం ఆడుతూ పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో నింపేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు భూమా రెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, బానాల నరేందర్, బద్దం సాయిరెడ్డి, ముర్తుజా ఖాన్, సౌజన్యతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.












