నిర్మల్ జిల్లా మండలంలోని వాసవి స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. సహజ సిద్ధమైన పూలతో బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ విద్యార్థులు సంబరాల్లో పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా మండలంలోని వాసవి స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సహజ సిద్ధమైన పూలతో బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ ఆకుల రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేకమైన గుర్తింపు కలిగించింది. చిన్నతనం నుంచే విద్యార్థులు ఈ సంప్రదాయ పండుగలో పాల్గొనడం ఆనందదాయకం అని పేర్కొన్నారు. ఈ పండుగ ద్వారా విద్యార్థులు మన సంస్కృతిని తెలుసుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.












