72వ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో నిర్మల్ అటవీ మండలాధికారి నాగిని భాను, నిర్మల్ ఎఫ్ఆర్ఓ రామకృష్ణ, భైంసా ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు, రాథోడ్ రమేష్, డిఆర్ఓ నజీర్ ఖాన్, డివిజనల్ అటవీ సిబ్బంది పాల్గొన్నారు.












