మహాత్మా గాంధీ జయంతి, వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ క్షేత్ర అధికారి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గ్రామ పురవీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా అటవీ క్షేత్ర అధికారి జె. కవిత మాట్లాడుతూ.. అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నుంచి 8 వరకు నిర్వహించే వన్యప్రాణుల వారోత్సవాల ప్రాధాన్యాన్ని వివరించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రకృతి సంపదను కాపాడేందుకు ప్రజలు అటవీ శాఖకు సహకరించాలని కోరారు. అనంతరం అటవీ క్షేత్ర అధికారి కార్యాలయం వద్ద జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అటవీ సిబ్బంది చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని వన్యప్రాణులను రక్షిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎల్. రమేష్, అటవీ క్షేత్ర అధికారి జె. కవిత, సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా గాంధీ జయంతి, వన్యప్రాణుల వారోత్సవాలు
Share:

సారాంశం
పర్యావరణ పరిరక్షణ
ముఖ్య విషయాలు
- నుంచి 8 వరకు నిర్వహించే వన్యప్రాణుల వారోత్సవాల ప్రాధాన్యాన్ని వివరించారు.
- మహాత్మా గాంధీ జయంతి, వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
- అటవీ క్షేత్ర అధికారి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గ్రామ పురవీధుల గుండా సాగింది.
- అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4121ఆర్టికల్స్
4,92,995వ్యూస్










