మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జీడిమెట్ల జాతీయ రహదారి సమీపంలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి డి సి సి ఉపాధ్యక్షులు , ధమని శ్రవణ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.












