సారంగాపూర్ మండలం లోని ధని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గ్రామ శాంతి, పరిశుభ్రత, సేవాభావాన్ని పెంపొందించాలని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాడి పోతన్న, ఉపసర్పంచ్ అరే నారాయణ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, రేషన్ డీలర్, ఏఈఓ తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.











