బైంసా పట్టణంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్‌ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఈ కిడ్స్ ఆర్అండ్డీ సంగీత విశిష్ట అతిథిగా, నారాయణ విద్యాసంస్థల స్కూల్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులకు స్వయంగా వివరించే అవకాశం కలుగుతుందన్నారు. తద్వారా విద్యార్థుల్లో కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ నైపుణ్యాలతో పాటు ఆత్మవిశ్వాసం, బాధ్యత పెంపొందుతాయని తెలిపారు.
ప్రిన్సిపాల్ ప్రభు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ అభ్యాసాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని ప్రదర్శిస్తున్నారో తల్లిదండ్రులు ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభిస్తుందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని నూతన నైపుణ్యాలను ప్రదర్శించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈ కిడ్స్ ఆర్అండ్డీ సంగీత, ఈ చాంప్స్ ఆర్అండ్డీ వనిత, ఏజీఎం ప్రసాద్, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ వరలక్ష్మి, ఈ చాంప్స్ కోఆర్డినేటర్ కళ్యాణి, హైస్కూల్ కోఆర్డినేటర్ నరేష్, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ హరితతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












